![]() |
![]() |
స్డార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ పొదరిల్లు. ఈ సీరియల్ శుక్రవారం నాటికి 150 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఈ సీరియల్ మహా పాత్ర చుట్డూ కథ సాగుతుంది. చక్రి, కేశవ, మాధవ, కన్నా, నారాయణ ఒక కుటుంబం కాగా మహా వాళ్ళ అన్నయ్య ఆది, వదిన హారిక, నాన్న ప్రతాప్ లది మరో కుటుంబం. ఈ రెండు కుటుంబాల మధ్య ఎక్కువ భాగం ఎపిసోడ్ లు టెలికాస్ట్ అయ్యాయి. అయితే తాజా ఎపిసోడ్ లలో ..కేశవ, శైలు లవ్ ట్రాక్ మొదలైంది.
కేశవ, శైలు ఇద్దరు బైక్ పై వెళ్తుంటే శైలు వాళ్ళ నాన్న చూస్తాడు. ఇక అదే రోజు శైలు ఇంటికొచ్చాక ఎక్కడికి వెళ్ళావని వాళ్ళ నాన్న అడుగగా కాలేజీకి అని శైలు చెప్పగానే అతను షాక్ అవుతాడు. అబధ్దాలు కూడా చెప్తున్నావా అంటూ వాళ్ళ నాన్న శైలుని కొడతాడు. ఇంకొకసారి ఆ మెకానిక్ గాడి వెంట తిరిగావంటే బాగోదని అంటాడు. అతనేం నా వెంట పడలేదు.. నేనే అతని వెంట పడ్డానని శైలు అనగానే వాళ్ళ నాన్న ఇంకా సీరియస్ అవుతాడు. మరోవైపు చక్రి, మహా ఇద్దరికి విడాకులు తీసుకోండి అని హారిక చెప్తుంది. అదే విషయం చక్రి ఇంట్లో వాళ్ళకి చెప్తాడు. తర్వాత లాయర్ దగ్గరికి వెళదామని అనుకుంటారు. అప్పుడే నారాయణ వాళ్ళ ఇంటికి విక్కీ, దివ్య వస్తారు. వాళ్ళని మహా తోసుకొని వస్తుంది. నారాయణ వాళ్ళ ఇల్లు చూసి విక్కీ ఇంప్రెస్ అవుతాడు.
నారాయణ వాళ్ళ ఇంట్లో వాళ్ళని విక్కీ పరిచయం చేసుకుంటాడు. అయితే అందులో చక్రిని చూసిన విక్కీ.. ఆ రోజు ఆఫీస్ లో గొడవ చేసింది నువ్వే కదా అని అంటాడు. అసలు నీకు, మహాకి సంబంధమేంటని అడుగుతాడు. ఇక తను మా కజిన్ అని మహా చెప్తుంది. దాంతో కేశవ, కన్నా నవ్వుకుంటారు. ఆ తర్వాత చక్రి ఫీల్ అవుతాడు. హారిక చెప్పినట్టుగా చక్రికి మహా విడాకులు ఇస్తుందా? నారాయణ వాళ్ళ ఇల్లు విక్కీ నచ్చుతుందా? కేశవని శైలు వాళ్ళ నాన్న అల్లుడిగా అంగీకరిస్తాడా అనేది తెలియాలంటే సోమవారం నాటి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
Podharillu Serial Star Maa Today Episode, Podharillu Serial Maha Chakri, Podharillu Serial Latest Highlights, Star Maa Telugu Serial Updates, Podharillu Serial 150 Episodes TeluguOne.
![]() |
![]() |